మంగళవారం 25 ఆగస్టు 2009

స్వభాష



"మ్యావుమని కూయలేని పిల్లి యెచటనైననున్నదా? ఈత రాని కప్ప ఏ దేశమందైననుండునా ? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకేమైనా సందేహమా? ఆంధ్రదేశముననున్న పక్షులే ననవరత శ్రవణమున మాటలాడుచుండగా - అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే అధమాధమారు సంవత్సరముల ఈడువరకైన ఆంధ్రమున మాటలాడినవాడే - అతడాంగ్లేయ భాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాటలాడలేకుండునా!"


ఈ మాటలు నేను తొమ్మిదో తరగతిలో చదువుకున్న తెలుగు పుస్తకం లోనివి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి 'స్వభాష ' మాకు గద్య భాగంలో పాఠ్యాంశంగా ఉండేది. ఈ 'స్వభాష ' పాఠం సాక్షి వ్యాసాల సంపుటి లోనిది. మా తెలుగు మాష్టారు ఈ పాఠాన్ని పదీ పదిహేను రోజుల దాకా చెప్పినట్లు గుర్తు. నాకు తెలుగంటే బాగా ప్రేమ ఏర్పడటానికి కారణం, ఆయన ఈ పాఠాన్ని అంతలా మనసులో నాటుకొనేట్లు చెప్పటమే.


ఇందులో పానుగంటి వారు , తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, తెలుగు మాట్లాడటం వచ్చి కూడా నిర్లక్ష్యంగా చూసేవారిపై వ్యంగ్యంగా సున్నితమైన హాస్యంతో కూడిన విమర్శను ' జంఘాల శాస్త్రి ' తో పలికిస్తారు.


తెలుగులో బ్లాగులు ఉన్నాయని ఈ మధ్యనే తెలిసింది. నా ఆలోచనలను పంచుకోవటానికి ఇది సరైన వేదిక అని తోచింది. ఇక్కడ ఎంతో మంది తెలుగు మీద ప్రేమతోనే ఈ తెలుగు బ్లాగులను నడుపుతున్నారు. వారందరికీ అభినందనలు.
ఈ సందర్భంగా నాకు తెలుగు మీద ప్రేమను పెంపొందించిన 'స్వభాష ' వ్యాసాన్ని, బోధించిన మా తెలుగు మాష్టారు 'చక్రవర్తి' గారిని, 'సాక్షి' వ్యాసాలను వ్రాసిన పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని స్మరించుకోవటం నా విధి.

3 వ్యాఖ్యలు:

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

baagundandi...........meeku telugante ishtamaaa.

evaina manchi books dorikithe dont forget to intimate me

వెంకటరమణ చెప్పారు...

@వినయ్: స్పందించినందుకు ధన్యవాదాలు.

M vamsi చెప్పారు...

Bagundi ramana...
Too good..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి