"ఆంగ్ల మాధ్యమ(ఇంగ్లీష్ మీడియం) పాఠశాలలో తెలుగు మాట్లాడితే జరిమానా" అని విన్న మాటలు నిజమేనని ఈ రోజు పేపర్లో చూశాక నమ్మక ఏం చేసేది ? నమ్మి మాత్రం చేయగలిగిందేమి మిగిలింది; చుట్టూ ఉన్న పది మంది ముందు, ఏమీ తెలియని ఈ బ్లాగుతో నా బాధను చెప్పుకోవటం తప్ప.
ఆంధ్రప్రదేశ్ లోని తల్లిదండ్రులారా, ఈ పర భాషా వ్యామోహాన్ని ఎప్పుడు వీడతారు! ఇంగ్లీష్ లో చదివితేనే భవిష్యత్తు బాగుంటుందనే అపోహను ఎప్పుడు వదిలేస్తారు ! !
ఆంధ్రదేశం లో పుట్టి, తెలుగు మాట్లాడటమే రాని వారు కొందరు, మాట్లాడటం వచ్చి వ్రాయటం-చదవటం రాని వారు కొందరు, అన్నీ వచ్చి నిర్లక్ష్యంగా చూసేవారు కొందరు. సిగ్గు సిగ్గు.
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel14.htm
మంగళవారం 27 అక్టోబర్ 2009
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

39 వ్యాఖ్యలు:
తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగాలు వస్తాయా? ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివిన మా తమ్ముడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరక్క ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. తెలుగు మీడియంలో చదివితే ప్రైవేట్ ఉద్యోగం దొరకడం కూడా కష్టమే.
@ప్రవీణ్ శర్మ: తెలుగు మీడియంలో చదివితే ఎందుకు రావు? నాకు తెలిసిన చాలా మంది పదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారే! అయినా ఇక్కడ సమస్య తెలుగు మీడియమా, ఇంగ్లీషు మీడియమా అన్నది వదిలేస్తే, తెలుగు ని నిర్లక్ష్యం చేయటం బాధ కలిగిస్తుంది.
నేను 1983లో పుట్టాను. నేను పుట్టక ముందు ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు తక్కువగా ఉండేవని తెలుగు మీడియం విధ్యార్థులే చెప్పారు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు ఎక్కువగా లేని టైమ్ లో తెలుగు మీడియం వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం విచిత్రం కాదులే.
ayya praveen gaaru , nenu kooda degree varaku telugu medium . aina ippudu nenu videshallo vudyogam chesthunnanu.
vudyogam vere vishayam , modata matru basha raakunte bavishyatthulo vallu pade badha varnanateetam .
@ప్రవీణ్ శర్మ గారు-- మీరు 1983 తర్వాత తెలుగు మీడియంలో చదివిన వారికి ఉద్యోగాలు రావు అన్నట్టు మాట్లాడుతున్నారు.కానీ అది నిజం కాదు నేను 1985 లో పుట్టాను నాది ఇంగ్లీష్ మీడియమే కానీ మా అక్క మరియు అన్నయ్య (1983,1981) చదివింది తెలుగు మీడియములో వారికి ఇప్పుడు తెలుగు బాగా వచ్చు ఇంగ్లీష్ బాగా వచ్చు. వాళ్ళూ చక్కగా ఉద్యోగాలు చెసుకుంటున్నారు. నాకు తెలిసి చాలా ఉద్యోగాలకి ఏమి చదివారు ఎంత వరకు విషయం వుంది అని చూస్తారు తప్పించి చదివింది ఏ మేడియం అని ఎవరూ పట్టించుకోరు
హిపోక్రిసీ ఎందుకు? తెలుగు బాషాభిమానం అంటూ మైక్ పట్టుకుని అరిచే వాళ్ళలో ఎంత మంది తమ పిల్లలని "దుంపల బడులు"కి పంపడానికి సిద్ధంగా ఉన్నారు? ఉత్తరాంధ్ర బాషలో "దుంపల బడి" అంటే తెలుగు మీడియం స్కూల్ అని అర్థం.
మనం ఇలా ఎన్నైనా చెపుతాం కానీ ఒక్కసారి ఆలో చించండి మీ పిల్లలు తెలుగు సరిగ్గా రాయడం చదవడం వస్తుందేమో చూసారా , ముందు ఇది ప్రభుత్వం తప్పు ,ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో తెలుగు ను ఒక అంశముగా తప్పక భోదిం చాలని జి.ఓ జారి చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది.
ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఎందుకు? పిల్లలని దుంపల బడులకి పంపకూడదు అనుకునేది తల్లితండ్రులే కదా.
@ప్రవీణ్ శర్మ : హిపోక్రసీ అంటే ఇక్కడ తెలుగు ని పట్టించుకోవటం లేదని అందరికీ చెప్పి తను మాత్రం తెలుగు ని ప్రోత్సహించక పోవటం. ఏ స్కూల్లో చేర్పించినా తెలుగు పట్ల మమకారాన్ని నేర్పించాల్సింది తల్లిదండ్రులే.
@ నాగ: తెలుగు పట్ల అభిమానం పెంపొందించాల్సిన బాధ్యత ముందు వ్యక్తులది,తల్లిదండ్రులది ఆ తర్వాత ప్రభుత్వానిది అనిపిస్తుంది. మీరన్నట్లు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో తెలుగు పదవ తరగతి వరకైన ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను.
తమ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదని టీచర్స్ నేర్పించడం లేదని అనే తల్లిదండ్రులు ఎందరో!!!మరి వాళ్ళ మాటేమిటో?
వెనక నేను bilingual kid అని ఒకకథ నా తూలిక.నెట్ లో రాసినప్పుడు, ఈటపాలోలాటి విషయాలు నాకు ఉత్తరాలరూపంలో తెలిసి వచ్చేయి. ఉద్యోగాలమాట ఒక నెపం. మనదేశంలో ఎంతమంది, ముఖ్యంగా రెండుతరాలవెనక మూడు, నాలుగుభాషలు వచ్చినవారు లేరు?
వెంకటరమణగారు చెప్పినట్టు తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.
ప్రవీణ్ శర్మా ! సరిగ్గా మాట్లాడ్డం చేతకాకపోతే నోరుమూసుకో ! ఎనిమిదిన్నఱ కోట్లమంది ప్రజల మాతృభాష, వారి నేషనల్ లాంగ్వేజి అయిన తెలుగుని అవమానించే హక్కు నీకు లేదు. తెలుగు ఏ జాతియొక్క నేషనల్ లాంగ్వేజికీ తీసిపోదు. నువ్వేమీ ఇంగ్లండు నుంచి దిగిరాలేదు. నువ్వు పుట్టక ముందునుంచీ ఉన్నదీ భాష. తెలుగులో ఏం పెద్ద చదివావని, ఏం తెలుసునని నువ్వు తెలుగుని విమర్శిస్తావు ? ఆంధ్రాలో కాకుండా ఇంకెక్కడైనా నువ్వు వాళ్ళ మాతృభాషమీద ఇలాంటి పిచ్చికూతలు కూసుంటే వాళ్ళు నిన్ను బతికుండగానే కైమా చేసుండేవాళ్ళు. బహుశా నీ ధైర్యం అదే అయ్యుండాలి. తెలుగుభాష మీద అభిమానం ఎప్పుడైతే నీకు లేదో అప్పుడే నువ్వు భాష గుఱించి మాట్లాడే హక్కు కోల్పోయావు. ఇలాంటివి సెంటిమెంటుకు సంబంధించిన విషయాలు. నీకు ఏ సెంటిమెంట్లూ లేవు. అదొక గొప్పనుకుంటావు నువ్వు. ఛీ ! ఛీ ! నువ్వు మనిషివి కావు.
-- తాడేపల్లి
అవునండి మాస్కూల్ లో వినుకొండనుంచి వచ్చి పనిచెసే ఒక మాశ్టర్ గారు వినుకొండలోని నిర్మల కాన్వెంట్ లో చదివిస్తున్నాడట . తెలుగు మాట్లాడినందుకు ఐదురూపాయల ఫైన్ తెమ్మన్నారని ఏడుస్తుంటే పిల్లవాని కోసం డబ్బుపంపామండి అని నవ్వుతూ ఇందాక నాతో చెబుతుంటే కడుపుమండిపోయింది. ఏం సార్ ! మరీ వెన్నుముకలేకుండా బ్రతకాలా ? జాగ్రత్త రేపు మీనాన్నపేరు తెలుగులో వుంది కాబట్టి వాడు మీనాన్నకాదు అనికూడా నేర్పగలరు అని ,కోపగించుకున్నాను.
మాలతి గారు. ముందు తరం గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. మా అమ్మగారు తెలుగు మీడియంలో చదివి బ్యాంక్ ఉద్యోగం సంపాదించారు. మా నాన్నగారు ఒరియా మీడియంలో చదివి బ్యాంక్ ఉద్యోగం సంపాదించారు. అప్పట్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు తక్కువ కనుక. బ్యాంక్ లెక్కలు ఇంగ్లిష్ లోనే వ్రాస్తారు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి బ్యాంక్ ఉద్యోగాలు ఇవ్వరు. మా అమ్మానాన్నలు తూ.గో. జిల్లాలో ఉద్యోగం చేసే రోజుళ్ళో వాళ్ళ బ్రాంచ్ కి ఒరిస్సా నుంచి వచ్చిన స్టాఫ్ ఒకతను వచ్చాడు. అది పల్లె ప్రాంతం కావడం వల్ల అక్కడ చాలా మందికి ఇంగ్లిష్ రాదు, కొత్తగా వచ్చిన ఒరిస్సా అతనికి తెలుగు రాదు. ఆ ఒరిస్సా అతనికి మా నాన్నగారితోనే కమ్యూనికేషన్ ఎక్కువ ఉండేది. జనానికి ఇంగ్లిష్ రాకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి.
నేను "దుంపల బడి" అనే ఫ్రేస్ ఉపయోగించాననే కదా మీరు నేను తెలుగుని అవమానించాను అంటున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లాంటి పట్టణాలలో చాలా మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు తెలుగు మీడియం స్కూళ్ళని "దుంపల బడులు" అనే అంటారు.
తెలుగుని నిర్లక్ష్యం చెయ్యటం వరకూ మీ ఆవేదనతో ఏకీభవిస్తాను. ఆంగ్ల మాధ్యమంలో చదువులు వద్దనటం సరి కాదు. నేటి కాలానికి అది అవసరం. అయితే ఆంగ్ల మీడియంలో చదువుతున్నంత మాత్రాన తెలుగు మాట్లాడటం నామోషీయో, తప్పో అనుకోవటం ఉందే - అదీ అభ్యంతరకరం. ఆ స్కూల్లో తెలుగు వాడకమ్మీద యజమాన్యానికి ఏం అభ్యంతరాలున్నాయన్నది అసలిక్కడ చర్చించాల్సిన విషయమే కాదు. తెలుగు మాట్లాడారని కానీయండి, మరే తప్పు చేశారనన్నా కానీయండి .. ఇలా బోర్డులు మెడలో వేసి తిప్పటం దారుణం. అదీ ఖండించాల్సిన విషయం.
చాలా రోజుల క్రితం శేఖర్ పెదగోపు గారే అన్నారు "చిన్నప్పుడు అతను తెలుగు మీడియం స్కూల్ లో చదివితే మీ అబ్బాయిని దుంపల బడిలో ఎందుకు వేశారు" అని అడిగేవాళ్ళు అని. నాకు తెలిసిన ఒక స్లమ్ ఏరియా యువకుడు పాలిటెక్నిక్ లో చేరి ఫెయిల్ అయ్యాడు. అతనికి ఇంగ్లిష్ సరిగా రాదు. నేను ఇంగ్లిష్ లో మాట్లాడితే అతనికి అర్థమయ్యేది కాదు. టెక్నికల్ విద్యకి కూడా ఇంగ్లిష్ అవసరమే.
@అబ్రకదబ్ర:
// ఆంగ్ల మాధ్యమంలో చదువులు వద్దనటం సరి కాదు. నేటి కాలానికి అది అవసరం. అయితే ఆంగ్ల మీడియంలో చదువుతున్నంత మాత్రాన తెలుగు మాట్లాడటం నామోషీయో, తప్పో అనుకోవటం ఉందే - అదీ అభ్యంతరకరం.
మీరు చెప్పినదాంతో ఏకీభవిస్తాను.
// ఆ స్కూల్లో తెలుగు వాడకమ్మీద యజమాన్యానికి ఏం అభ్యంతరాలున్నాయన్నది అసలిక్కడ చర్చించాల్సిన విషయమే కాదు.
చర్చించాల్సిన విషయమే అనుకుంటున్నాను. యాజమాన్యం మీద తల్లిదండ్రుల ఒత్తిడి ఉండకపోతే మరీ ఆ స్థాయికి వెళ్ళి ఉండకపోవచ్చు. దీనికి ఆంధ్రదేశ ప్రజలందరూ,స్కూలు యాజమాన్యాలు బాధ్యులే.
వెంకట రమణ గారు ఒక నిజం చెప్పారు "తల్లితండ్రుల సపోర్ట్ లేకుండా స్కూల్ యాజమాన్యాలు ఈ రూల్స్ పెట్టలేవు".
@వెంకటరమణ:
>> "యాజమాన్యం మీద తల్లిదండ్రుల ఒత్తిడి ఉండకపోతే మరీ ఆ స్థాయికి వెళ్ళి ఉండకపోవచ్చు. దీనికి ఆంధ్రదేశ ప్రజలందరూ,స్కూలు యాజమాన్యాలు బాధ్యులే"
నిజమే. ఆ కోణంలోనూ ఆలోచించాల్సిందే.
నేను వెంకటరమణ తొ ఎకీభవిస్తున్నా.. (ప్రవీణ్ చెప్పింది ఒకరకంగా అదే,,,) .. ఇక్కడ స్కూల్ యాజమాన్యాం రెండు తప్పులు చెసింది.
ఒకటి ఇంగ్లిష్ లొ మాట్లాడటం తప్పు అని అర్దం వచ్చేలా ప్రవర్తించారు. (..వచ్చేలా ఎమిటి ..సూటిగానే ) నాకు తెలిసి యాజమాన్యం తల్లితండ్రులకు " తెలుగు లొ మాట్లాడితే ఇక్కడ తప్పు అని... మాట్లాడితే అపరాద రుసుం చెల్లించాలని చేరక ముందె చెబుతారు " ఎంత మంది ఈ ఒక్క విషయం కారణం గా వెరె బడికి పంపుతున్నారు. అదే ప్రవీణ్ అడిగినట్టున్నాడు.. ఈ తప్పుకి తల్లితండ్రులదే 99 శాతం బాద్యత..
రెండోది.. తెలుగు లొ మాట్లాడటం అన్నది ఎంత పెద్ద తప్పు అని.. మెడలొ బోర్డ్ లు వెసి తిప్పెంత దారుణమయిన నేరమా అని.. ఎంత పెద్ద నేరం చెసినా చిన్నపిల్లల మెడలొ అలాంటివి వెసి తిప్పడం ఖండిచాల్సిన విషయం.. ఈ తప్పు కి మాత్రం స్కూల్ యాజమాన్యందే 100 శాతం బాద్యత..
@అబ్రకదబ్ర:
ఇలా బోర్డులు మెడలో వేసి తిప్పటం దారుణం. అదీ ఖండించాల్సిన విషయం.
ఈ ఒక్కటీ ఖండిస్తున్నా
అబ్రకదబ్ర: "ఆంగ్ల మాధ్యమంలో చదువులు వద్దనటం సరి కాదు. నేటి కాలానికి అది అవసరం." నేటి కాలానికి ఇంగ్లీషులో చదవడం ఎందుకవసరమో చెప్పాలి మీరు. ప్రస్తుత సమస్యలో ప్రధాన విషయం ప్రాథమిక విద్య అనే సంగతిని దృష్టిలో ఉంచుకునే మీరు మాట్టాడుతున్నారని నేను అనుకుంటున్నాను.
ఇక బోర్డు మెడలో వెయ్యడం గురించి: పాతికేళ్ళ కిందటే ఇలాంటి ఘటనలు జరిగాయి. తెలుగులో మాట్టాడినవాడికి "అయామె తెలుగు డాంకీ" అనే బోర్డు తగిలించారు. ఎక్కడ, ఏమిటీ అనేది తరవాజ్జెబుతాను. ముందు మీరు, నేటి కాలానికి ఇంగ్లీషులో చదవడం ఎందుకవసరమో చెప్పండి.
ఆంగ్ల మాధ్యమం వద్దనే వారెవరైనా తమ పిల్లల్ని తెలుగులో చదివిస్తున్నారా చెప్పండి? అసలు అలాంటి అవకాశం ఉందా?ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రామాణికత లోపించబట్టి అక్కడ చదివించడం మనకి కుదరదు, ఇష్టం లేదు. మరి అక్కడ తప్ప వేరే స్కూళ్ళలో(చివరికి నలుగురు పిల్లలల్తో వీధి చివర మొదలయ్యే స్కూలు కూడా సైంట్ బ్లా బ్లా బ్లా యే నాయె)! ఇక తెలుగు మీడియం పాఠశాలలెక్కడున్నాయి?
ఆంగ్ల మాధ్యమం సంగతి అలా ఉంచి అసలు ఇంగ్లీష్ పూర్తిగా తీసేసినా ఈ దేశానికి నష్టం లేదంటున్నారు కొందరు.ప్రభుత్వ శాసనాల నుంచి, చట్టాల నుంచి రాజ్యాంగం వరకూ ఆంగ్లంలో ఉన్నపుడు దాన్ని పూర్తిగా తీసేస్తే ఏం జరుగుతుందో ఆలోచించక్కర్లేదా? మరి అవన్నీ దేశ ప్రజలందరికీ అర్థమవ్వాలంటే ఏ భాషలో ఉండాలి? హిందీలోనా?
అలా అయితే కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకోరు.మరి అప్పుడేం చేయాలి? ఎవరి రాష్ట్ర భాషలో వాళ్ళకు వీటన్నింటినీ అందించాలా? అలా అయితే ఇక ఎక్కడివాళ్ళు అక్కడే తప్ప వేరే రాష్ట్రాలకో, దేశాలకో వెళ్ళే పనే లేదన్నమాట!
ఆంగ్ల మాధ్యమం వల్ల నష్టమేమీ లేదు.తెలుగుని రక్షించుకోడానికి అదేమీ అడ్డం కాదు. కాకపోతే ఆంగ్లమే జీవితంగా మారక్కర్లేదని,నిత్య జీవితంలో మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని చెప్పండి చాలు!
ఇందాక ఎక్కడో చదివాను ఒక భాషను నేర్చుకోవాలంటే ఇంకో భాషను కించపరచనక్కర్లేదని! అలాగే తెలుగుని రక్షించుకోవాలంటే ఇంగ్లీషుని పూర్తిగా వెళ్ళగొట్టక్కర్లేదు. ఎవరి పిల్లల వరకూ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే!
పై వ్యాఖ్యలో తెలుగులో అంటే తెలుగు మాధ్యమంలో అని నా ఉద్దేశం!
నేను ఇంగ్లిష్ మీడియం విద్యకి వ్యతిరేకం కాదు కానీ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో ఇంగ్లిష్ సరిగా నేర్పిస్తున్నారనుకోను. ఇంగ్లిష్ లో మాట్లాడాలని రూల్ పెడతారు కానీ దగ్గరుండి ఇంగ్లిష్ నేర్పించరు. అందుకే పిల్లలు తెలుగులో మాట్లాడి ఫైన్లు కట్టడం లేదా మెడలో బోర్డులు పెట్టుకోవడం జరుగుతుంది. నేను చదివినది ఇంగ్లిష్ మీడియమే. నా కంటే వయసులో పదేళ్ళు పెద్దైన ఇంకో ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్ కి నాకు వచ్చినంత ఇంగ్లిష్ కూడా రాదు. నేను ఇంగ్లిష్ లో పంపిన ఒక మెయిల్ అతనికి అర్థం కాకపోవడం వల్ల తెలుగులో పంపమన్నాడు.
శిరీష్ గారు "ఐ యామ్ ఎ తెలుగు డాంకీ" అని బోర్డు ఏ ఊర్లో ఏ స్కూల్ విద్యార్థులకి పెట్టించారు? వైజాగ్ లోనా? విజయవాడలోనా? కరీంనగర్ లోనా? ఎందుకు అడుగుతున్నానంటే మా వదిన కూడా వైజాగ్ లోని ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివింది. ఆమెకి తెలుగు చదవడం, వ్రాయడం రాదు. నాకు కంప్యూటర్లు రిపైర్ చెయ్యడం నేర్పిన గురువు విజయవాడలో చదువుకున్నాడు. అతను 10వ తరగతి పూర్తైన తరువాతే తెలుగు చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. నేను కరీంనగర్ లో చదువుకునే రోజుల్లో స్కూల్ లో తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసేవాళ్ళు.
ప్రవీణ్ శర్మ గారూ, చర్చల్లో మనం అసలుసమస్యను పక్కన బెట్టేసాం. అసలుసమస్యతో పోలిస్తే మెళ్ళో పలక వేసాడనేది పెద్ద విషయం కాదని నా ఉద్దేశం. బడుల్లో శిక్షలు ఎలా వేస్తారనేది మన చర్చాంశమైతే నేనీ చర్చలో పాల్గొననండి.
అసలీ బుల్లి బుజ్జాయిలకు పాఠాలు తెలుగులో చెప్పాలా, ఇంగ్లీషులో చెప్పాలా అనేది మనం చర్చించాల్సిన విషయం. అదయ్యాక, అప్పుడు అందుకు కారణం ఎవరు, నివారణోపాయం ఏంటి లాంటి సంగతులు చూద్దాం.
శిక్షలు ఎలా వేస్తారనేది ఇక్కడ చర్చాంశం కాదు కానీ తెలుగులో మాట్లాడినందుకు వేసిన శిక్ష విషయం మాత్రం చర్చాంశమే. అందుకే ఏ ఊర్లో, ఏ స్కూల్ లో వేశారు అని అడిగాను. ఇంత కాంట్రోవర్సీ వచ్చినది తెలుగులో మాట్లాడినందుకు వేసిన శిక్ష గురించే కదా. శిక్ష వెయ్యకుండా కేవలం తిట్టడం లాంటివి చేసి ఉంటే ఇంత కాంట్రోవర్సీ వచ్చేది కాదు కదా.
చదువరి గారూ, ప్రవీణ్ శర్మ గారు చెప్పినట్లు ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నందుకు శిక్షవేశారు కాబట్టి చర్చనీయాంశమే.
మీరు చెప్పిన అంశం చిన్నపిల్లలకు పాఠాలు తెలుగులో చెప్పాలా? ఆంగ్లంలో చెప్పాలా అనేది మూలాంశమే. నేటి పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదువులు ఉండాలా? అయితే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించారు. నాకు తోచిన అభిప్రాయం చెబుతాను. నేను పాఠశాలలో చదువుకొనేటప్పుడు ఐదవ తరగతి నుండి ఇంగ్లీషు బోధించేవారు. నాకంటే 15-20 సంవత్సరాల ముందు ఆంగ్లం ఇంకా ఎగువ తరగతిలో నేర్చుకున్నారు. జనాభా పెరిగి, పోటీతత్వం పెరగటంతో, అంతర్జాతీయ ఉద్యోగావకాశాల కోసం ఇంకా ముందుగానే ఆంగ్లాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టారు. రాను రానూ పోటీ విపరీతంగా పెరగటంతో ఆంగ్ల మాధ్యమంలో చదువులు, మూడు సంవత్సరముల వయసు నుండే బడికి పంపించటం మొదలయ్యాయి. అధిక జనాభా, ఎందులో చూసినా విపరీతమైన పోటీ, మనదేశంలోని ఉద్యోగాలు అందరికీ సరిపోనప్పుడు విదేశీ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఆంగ్ల మాధ్యమంలో బోధన కావాల్సిందే కదా! మీరు చెప్పిన అంశంలో ఆలోచించ వలసింది ఏమిటంటే ఏ స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యంలో బోధన ఉండవచ్చు అనేది.
అంతకుముందు 5 సం|| నిండితే గానీ ఒకటో తరగతిలో చేర్చుకొనేవారు కాదు. ఎంత పోటీ పెరిగినా ప్రజలు గమనించని విషయం ఏమిటంటే అంత చిన్న వయసులో, మానసికంగా వికసించాల్సిన వయసులో తెలుగు, ఇంగ్లీషు, హిందీ నేర్చుకోలేకపోవటంతో ఒక్క ఆంగ్లంపైనే దృష్టి పెడుతున్నారు. అదే ప్రాధమిక స్థాయిలో ఒక్క తెలుగు మాధ్యమంలోనే బోధన ఉండి, ఆంగ్లం కనీసం మూడవ తరగతి నుండి మొదలు పెట్టి 5 వరకు చిన్న చిన్న పదాలు నేర్చుకోవటం వరకు అయితేనే వారి మీద ఒత్తిడి ఉండదు. వారిని మరీ మూడవ సంవత్సరంలోనే బడికి పంపకూడదు. నేను చదువుకున్న అనుభవాల నుంచి ఆలోచిస్తున్నానేమో తెలియదు కనీసం ఏడవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదవకపోయినా పిల్లల మీద ప్రభావం ఉండదని అనుకుంటున్నా. ఆంగ్ల మాధ్యమంలో తెలుగు పాఠ్యాంశంగా ఉన్నా పిల్లలకు తెలుగు రావటంలేదని బాధ పడాల్సిన అవసరం ఉండదు.
ఇక నాకున్న సందేహాలు, సదుపాయాలు సరిగ్గా లేని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎవరూ చూడరు. మరీ 3 సం|| నుండి పిల్లలను బడికి పంపకుండా ఉంటారా? ఒకవేళ పంపకుండా ఉన్నా గానీ, పట్టణాల్లో ఉన్న పాఠశాలల్లో నేరుగా ఒకటోతరగతిలో చేర్చుకుంటారా? అసలు ముందు ప్రజలు తెలుగు మాధ్యమంలో బోధనకు ఒప్పుకుంటారా? ప్రపంచం ముందుకు వెళ్తుంటే మనం వెనక్కి వెళుతున్నామని నిరసిస్తారా?
"I am a telugu donkey" అని బోర్డ్ పెట్టడం జరిగితే మాత్రం అది తెలుగు బాషకి అతి పెద్ద అవమానమే. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఇంగ్లిష్ మీడియంలో చదివినవాడు కావచ్చు కానీ అతని తల్లితండ్రులు తెలుగు మీడియంలో చదివినవాళ్ళే కనుక అలా బోర్డ్ వ్రాయించడం అతని తల్లితండ్రులకి కూడా అవమానమే.
వెంకటరమణ గారూ,
"..ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నందుకు శిక్షవేశారు కాబట్టి చర్చనీయాంశమే." -మనకు తెలిసొచ్చిన సంగతిది. శిక్ష మారొచ్చుగానీ చాలా బడుల్లో అది నేరమే. తెలుగులో మాట్టాడినందుకు ఫైను వెయ్యడమనేది చాలా బడుల్లో అమలౌతూంది. తప్పే, కాదని నేను అనడం లేదు. కానీ, తెలుగుభాషకు అలవాటు పడిన పసికందులకు తన మాతృభాషను పక్కనబెట్టి, చదువు ఇంగ్లీషులో చెప్పడం సబబేనా? అనే మౌలికమైన ప్రశ్న అడుగుతున్నాను.
"..కనీసం ఏడవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదవకపోయినా పిల్లల మీద ప్రభావం ఉండదని అనుకుంటున్నా. " అని మీరు అన్నారు. మీ అనుకోలు సరైనదేనని నా ఉద్దేశం. ఏడో తరగతి దాకా కాకపోయినా, కనీసం ప్రాథమిక విద్య తెలుగులో చదువు చెప్పాలి అని నేను అంటున్నాను.
మీరు, నేనూ చెబుతున్న ఈ మౌలికాంశాన్ని పెద్దలు ఒప్పుకుంటే మనం చర్చలో ముందుకు పోవచ్చని నా ఉద్దేశం. :)
ప్రవీణ్ శర్మ: "ఐ యామ్ ఎ తెలుగు డాంకీ" అని ఎవరు ఎక్కడన్నారో ముందుముందు చర్చలో వస్తుందిలెండి. :) ముందోమాట చెప్పండి.. తెలుగుభాషకు అలవాటు పడిన పసికందులకు తన మాతృభాషను పక్కనబెట్టి, చదువు ఇంగ్లీషులో చెప్పడం సబబేనా?
ఇంగ్లిష్ మీడియం బోధనకి నేను వ్యతిరేకం కాదని నేను ముందే చెప్పాను. స్కూల్ లో ఇంగ్లిష్ మాట్లాడాలి అని రూల్ పెట్టినంతమాత్రాన ఇంగ్లిష్ రాదు. ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివిన నా కంటే ఒరియా మీడియం దుంపల బడిలో చదివిన మా నాన్న గారు ఇంగ్లిష్ బాగా మాట్లాడేవారు. వైజాగ్ లో క్రిస్టియన్ స్కూల్ లో చదివిన నా స్నేహితురాలి కంటే పల్లెటూరి తెలుగు దుంపల బడిలో చదివిన ఆమె భర్త ఇంగ్లిష్ లో బాగా మాట్లాడుతాడు. ఇలాంటి ఉదాహరణలు నా దగ్గర బోలెడు ఉన్నాయి. మెడలో డాంకీ, డాగ్, ఫాక్స్ లాంటి బోర్డులు పెట్టినంతమాత్రాన ఇంగ్లిష్ వస్తుంది అనుకుంటే అది పెద్ద భ్రమే. గవర్నమెంట్ స్కూల్ లో చదివినవాడు పెద్దైన తరువాత బయట పుస్తకాలు చదివి ఇంగ్లిష్ నేర్చుకుంటాడు. ప్రైవేట్ స్కూల్ లో చదివినవాడు మాత్రం సరైన ట్రైనింగ్ లేని తమ సోకాల్డ్ ఇంగ్లిష్ గురువులు నేర్పిందే ఇంగ్లిష్ అనుకుంటాడు.
నాకు స్కూల్ లో జాయిన్ అవ్వక ముందే మా నాన్న ఇంగ్లీష్ బుక్ అండ్ లెక్కలు (ఎక్కాలు) చదివించారు .తెలుగు అస్సలు చదివించలేదు .ఎందుకంటే నాకు అది ఆల్రెడీ వచ్చు కాబట్టి.
అసలు ౫ వ క్లాసు నుండి తెలుగు చెప్పడం మొదలు పెడితే బాగుంటుందేమో :). అప్పటి వరకు ఇంగ్లీష్ అన్నమాట.
ఇంగ్లిష్ నేర్చుకోవడం కొంచెం కష్టమైనా ప్రయత్నించి నేర్చుకోవాలి కానీ మెడలో బోర్డులు కట్టించుకుని మాత్రం కాదు. తెలుగులోలాగే ఇంగ్లిష్ లో కూడా regional variations ఉన్నాయి. ఉదాహరణకి అడుక్కోవడాన్ని బ్రిటన్ లో begging అంటారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో pan handling అంటారు. రైలు మార్గాన్ని బ్రిటన్ లో railway అంటారు, అ.సం.రా.లో railroad అంటారు. స్కూల్ లో ఇంగ్లిష్ నేర్చుకున్న వాళ్ళు విదేశాల నుంచి ఇంపోర్ట్ అయిన పుస్తకాలలోనో, ఇంటర్నెట్ లోనో regional variations చూసి కొంత వరకు కంఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలకి ఇంగ్లిష్ సరిగా నేర్పిస్తే సంతోషమే కానీ మెడలో బోర్డులు కట్టి నేర్చుకోవలసిన బాధ్యత మీదే అని పిల్లల మీద నింద వెయ్యడం మాత్రం అర్థం లేని పని.
ఇన్ని కధలేందుకు , స్కూల్ వాళ్ళు పిల్లలు తెలుగు లో మాట్లాడితే బోఅర్డ్స్ కాకుండా ఇంకేదైనా కట్టాలా? ...సోల్యూషన్ గురించి చర్చించండి ..
పిల్లల్ని పేరెంట్స్ దగ్గరనుండి లెటర్ తెచుకోమంటే సరిపోలా ? మా పిల్లలు అప్పుడప్పుడు తెలుగు మాట్లాడనివ్వండి అని ....
నా అభిప్రాయం ప్రకారం తెలుగు బాష అంతరించిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. మెడలో బోర్డులు కట్టడం వల్ల ఇంగ్లిష్ రాదు అనేదే నా అభ్యంతరం. దొంగలకీ, వ్యభిచారులకీ మెడలో బోర్డులు వేసి గాడిద మీద ఊరేగిస్తే ఫర్వా లేదు కానీ చిన్న పిల్లలకి ఇంగ్లిష్ నేర్పించడానికి మెడలో బోర్డులు కడితే మాత్రం నెగటివ్ కాన్సీక్వెన్సెస్ వస్తాయి. తమకి బలవంతంగా ఇంగ్లిష్ ఎందుకు నేర్పిస్తున్నారో పసి పిల్లలకి అర్థం కాదు. అబ్రకదబ్ర గారు చెప్పినట్టు ఇది నిజంగా 420 గాళ్ళ మీద చేసే ప్రయోగంలాగ ఉంది.
కొన్ని సినిమాలలో చూసే ఉంటారు. స్టేషన్ లో పోలీసులు నేరస్తుల మెడలో పలకలు కడతారు. ఆ పలకల మీద "నేను దొంగని", "నేను వేశ్యల్ని సప్లై చేసే బ్రోకర్ ని", "నేను మోసగాడిని" లాంటివి వ్రాసి ఉంటాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా సినిమాలు చూసి పిల్లల మీద అలాంటి ప్రయోగం చేసి ఉంటాడు.
"I am a telugu donkey" అని మెడలో బోర్డు కట్టిన ఘటన ఎక్కడా జరగలేదు. అది ఒక ఫాబ్రికేటెడ్ స్టోరీ. మన వాడు డిలీట్ చేసిన విమర్శలలో ఒకటి ఈ ఇమేజ్ లో ఉంది చూడండి: http://img42.imageshack.us/i/clipboard01wv.png/
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి