నేను చదువుకున్న తెలుగు పుస్తకాలలో నాకు బాగా ఇష్టమైన తెలుగు పుస్తకం తొమ్మిదో తరగతిది. క్రికెట్ మతం పుచ్చుకొని అందులో కూరుకుపోయాక ఈ పుస్తకాన్ని పోగొట్టుకున్నట్లున్నాను.ప్రయత్నిస్తే ఇందులోని పాఠాలను ఆయా రచయితల రచనల ద్వారా పొందవచ్చు.కానీ ఎందుకో ఆ పుస్తకమే కావాలనిపిస్తుంది.ఈ పుస్తకాన్ని తిరిగి సంపాదించాలంటే ఎవరికైనా మార్గం తెలిస్తే దయచేసి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి దగ్గర పాత పుస్తకాలు ఉంటాయా ?
గుర్తులు :
పద్యభాగం :
రాజధర్మం : నన్నయ భట్టు :-
"..............వార్త యందు జగము వర్తిల్లు చున్నది"
"ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెరింగి వారినయ్యుత్తమ ...."
"సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ ......"
పార్వతీ తపస్సు : శ్రీనాధుడు
"ఎక్కడ లేరె వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకూన నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ ...."
"భూధర రాజకన్య మణి భూషణముల్ దిగద్రావి ...."
అప్పగింతలు: తాళ్ళపాక తిమ్మక్క
ద్విపద కావ్యం -- శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవి అప్పగింతల సమయంలో సుభద్రతో సంభాషించే సందర్భం.
ఇందీవరాక్షుని వృత్తాంతం : అల్లసాని పెద్దన
పెద్దన వలె కృతి సెప్పిన పెద్దనవలె
పెద్దన వలె కృతి సెప్పిన పెద్దనవలె
"కలడుల్లోక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్ ...."
"కంటే బ్రాహ్మణుడెన్ని కారులరచెన్ గర్వించి వీరెల్ల నాకంటె పాత్రులె విద్య కెట్లు ....."
అనినం గన్నులు జేవురింప నధరంబల్లాడ వేల్లత్పునః
పున రుద్యద్భృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరా నిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మాంబువుల్
చినుకుం గంతు దిద్రుక్షు రూక్ష నయన క్ష్వేళా కరాళ ధ్వనిన్
పున రుద్యద్భృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరా నిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మాంబువుల్
చినుకుం గంతు దిద్రుక్షు రూక్ష నయన క్ష్వేళా కరాళ ధ్వనిన్
"జటిల్లుండు కిటకిటం పండ్లుగొరికి హుమ్మని కటమ్ములదర ముకుపుటమ్ములు నటింప ...."
భాస్కరా : మారవికవి
"చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న....."
"ఉరు గుణవంతుండు తనకొండపకారం సేయునప్పుడుం ..."
"ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన ......."
ధర్మరాజు : చేమకూర వేంకటకవి
"ఆ పురమేలు మేలు బళి యంచు ప్రజలు జయవెట్టుచుండ...."
"అవలబోయిన వెన్క టాడుటెన్నడునూ లేదు
మొగము ముందరనంట మొదలె లేదు......"
"దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియ వక్తృత్వంబు కాణాచి ...."
"దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియ వక్తృత్వంబు కాణాచి ...."
శివాజీ సౌశీల్యం : కరుణశ్రీ
" ఏమీ ఒక రాణీ వాసమున్ పుణ్యావాసమున్ తెచ్చినావా ? ...."
పోతన జిజ్ఞాస : వానమామలై వరదాచార్యులు
"ఇవ్విధి దివ్విటీల్వెలుంగునేమని బాలుడు పృచ్ఛసేయగా ...."
పెన్నేటి పాట : విద్వాన్ విశ్వం
"అదే పెన్న అదే పెన్న
నిదానించి నడు
విదారించు నెదన్
ఒట్టి ఎడారి తమ్ముడూ ......"
గద్యభాగం :
నీలగిరి : కోలా శేషాచల కవి
గ్రాంధిక భాషలో సాగినా గానీ నీలగిరి ప్రకృతి వర్ణన- చెట్లు, పండ్లు, మంచు గురించి అద్భుతంగా కళ్ళముందున్నట్లు ఉంటుంది.
స్వభాష : పానుగంటి లక్ష్మీ నరసింహా రావు
ఒక సభలో తెలుగు వచ్చి కూడా నిర్లక్ష్యంగా చూసేవారిపై , తెలుగు లో మాట్లాడటాన్ని చిన్నతనంగా భావించే వారిపై జంఘాల శాస్త్రి వ్యంగ్యాస్త్రం.
"మృదు మందార బిందు స్యందన మగు మన భాషయే ! కమ్రతకు కమ్రత, కఠినతకు కఠినత , బిగి బిగి , జోరునకు జోరు , ఎదురెక్కునకెదురెక్కు, అన్ని హొయలు , అన్ని వయ్యారములు , అన్ని తళుకులు అన్ని బెళుకులు , అన్ని ఒద్దికలు గల భాషయే వచనమునకు , వ్యాసమునకు, పాడుటకు సంపూర్ణార్హతగల మాతృభాషయే !"
ముష్టివాడు నిన్ను "బాయ్ ఇంట్లో ఉన్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో కైండ్లీ గెటిట్ హియర్" అనినచో ముష్టి వేయుదువా మూతిమీద ఈడ్చి ఒక్కటి వేయుదువా! ?
"మ్యావుమని కూయలేని పిల్లి యెచటనైననున్నదా? ఈత రాని కప్ప ఏ దేశమందైననుండునా ? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకేమైనా సందేహమా? ఆంధ్రదేశముననున్న పక్షులే ననవరత శ్రవణమున మాటలాడుచుండగా - అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే, ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, అధమాధమారు సంవత్సరముల ఈడువరకైన ఆంధ్రమున మాటలాడినవాడే - అతడాంగ్లేయ భాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాటలాడలేకుండునా? "
సోమనాద్రి : సురవరం ప్రతాపరెడ్డి
సోమనాద్రి శౌర్యమును గురించి , అతని మేలుజాతి గుర్రం గురించి.
లోకమాన్యుడు : ముట్నూరి కృష్ణారావు
బాలగంగాధర తిలక్ గొప్పదనాన్ని గురించి.
శకున పరిగణనము : వేటూరి ప్రభాకర శాస్త్రి
శకున పరిగణనము : వేటూరి ప్రభాకర శాస్త్రి
సంస్కృతి - ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందుశేఖరం
చాటువులు - శ్రీనాధుడు ఎండాకాలంలో పల్నాటి ప్రాంతంలో పర్యటిస్తూ తాగటానికి నీళ్ళు దొరక్క చెప్పిన పద్యమట
సిరిగల వానికి జెల్లును
దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్ద రాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
చిలకమర్తి వారు చెప్పిన మరో పద్యం
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు మూతులు బిగియగట్టి
చాటువులు - శ్రీనాధుడు ఎండాకాలంలో పల్నాటి ప్రాంతంలో పర్యటిస్తూ తాగటానికి నీళ్ళు దొరక్క చెప్పిన పద్యమట
సిరిగల వానికి జెల్లును
దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్ద రాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
చిలకమర్తి వారు చెప్పిన మరో పద్యం
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు మూతులు బిగియగట్టి
కాశ్మీర యాత్ర : నాయని కృష్ణకుమారి
దాల్ సరస్సు అందాలు , బోటు షికారు, ఆపిల్ తోటలు, మంచు, తెల్లదనం, ఆహ్లాదకరమైన ప్రకృతి వర్ణనలు.
ఎవరు గొప్ప :
బాటసారి సూర్యుడి కి నమస్కరించటం - అసూయతో వాయువు - సూర్యుడికీ , వాయువుకీ , ఎవరుగొప్ప అనే విషయంలో మాటా - మాటా - అతని ఒంటిపై ఉన్న కంబళిని ఎవరు తొలగించగలరు అనేదానిపై పందెం - గాలి బలంగా వీచినపుడు బాటసారి మరింత గత్తిగా కంబళి ని ఒంటికి చుట్టుకోవటం - సూర్యుడు తీక్షణమైన ఎండను ప్రసరింపజేసినపుడు బాటసారి ఉక్కబోతతో కంబళిని ఒంటిమీద నుంచి తీసివేయటం - సూర్యుడి గెలుపు
బాటసారి సూర్యుడి కి నమస్కరించటం - అసూయతో వాయువు - సూర్యుడికీ , వాయువుకీ , ఎవరుగొప్ప అనే విషయంలో మాటా - మాటా - అతని ఒంటిపై ఉన్న కంబళిని ఎవరు తొలగించగలరు అనేదానిపై పందెం - గాలి బలంగా వీచినపుడు బాటసారి మరింత గత్తిగా కంబళి ని ఒంటికి చుట్టుకోవటం - సూర్యుడు తీక్షణమైన ఎండను ప్రసరింపజేసినపుడు బాటసారి ఉక్కబోతతో కంబళిని ఒంటిమీద నుంచి తీసివేయటం - సూర్యుడి గెలుపు
8 వ్యాఖ్యలు:
అవునండీ నేనూ ఇదే పుస్తకం చదివాను. ఎనినింది, పది పుస్తకాలకంటే ఈ పుస్తకం ఎందుకో ప్రత్యేకంగా ఉండేది.(అప్పుడు సంకలనకర్త ఎవరో చూడాలన్న జ్ఞానం లేదు :( ఉపవాచకం ప్రకాశం పంతులైతే నేనెన్ని సార్లు చదివానో లెఖ్ఖేలేదు. పాతపుస్తకాలకొట్టుల్లో దొరకొచ్చేమో.
thanks for your post. I am able to remember some poems from your post.
I think it is not a big issue to get that 9th class text book. You will get from old telugu academy.
Some people have some sentiments and they don't sell or destroy the text books. In that case they keep old books on the terrace. May be do the enquiry in the blogs and some one defintetly will help you
పాఠాలు చాలా గుర్తు పెట్టుకున్నారే! పాత టెక్స్టు పుస్తకాల మీద ఏకంగా ఒక బ్లాగే నడిచింది గతంలో. ప్రస్తుతం చురుగ్గా లేదు. అక్కడ మీకా పుస్తకం దొరుకుతుందని కాదుగానీ ఆ సైటు మీకు ఆసక్తి కలిగించవచ్చు.
@బుడుగు : పాత పుస్తకాల కొట్టుల్లో ప్రయత్నించానండీ. దొరకలేదు. ధన్యవాదాలు. రవీంద్రుడు, ప్రకాశం పంతులు వారిని గురించిన ఉపవాచకాలు గుర్తున్నాయి.
@లక్ష్మణ్ : ధన్యవాదాలు. తెలుగు అకాడమీలో ప్రయత్నిస్తాను.
@చదువరి : మంచి లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు.
హేయ్ !!! నేను కూడా ఇదే పుస్తకం చదివాను.
"... గుండ్రాడాచిన బెండ్లి ఏమిటికి జిక్కుం కష్టముష్టింపచా" అనే పద్యం కూడా ఉండెది. అప్పట్లో, ఈ కష్టముష్టింపచా అని తెగతిట్టుకునే వాళ్ళం.
అలాగే ఇందులో స్వభాష అనే గద్య పాఠం కూడా నాకు చాలా ఇష్టం. ఇందులోనే అనుకుంట, తెలుగు భాష అందాన్ని గురుంచి ఒక పేరా ఉంటుంది " మందార మాధుర్య మకరందముననేలు..." అని మీకు పూర్తిగా గుర్తుంటె చెప్దురూ.... నేను అది కాపీ చెసి ప్రింట్ తీసి నా డెస్క్ మీద పెట్టుకుంటాను.
Nice
పుస్తకంలో ఉన్న పాఠాలన్నీ గుర్తు పెట్టుకున్న మీ జ్ఞాపకశక్తి కి 'హాట్స్ ఆఫ్ '!!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి